కోరిక , లక్ష్యం ల మధ్య తేడా :
పురాణాల్లో ఋషులు , గౌతమ బుద్ధుడు కోరికలు లేనప్పుడే మనిషి ప్రశాంతంగా ఉంటాడని, కోరికలే మనిషి యొక్క అన్ని బాధలకు కారణం అని చెప్పారు. ఏ విధమైన కోరికలు లేనపుడు మనిషి జీవితం నిస్సారంగా , నిస్తేజం గా అనిపిస్తుంది.
అసలు కోరిక, లక్ష్యం రెండు ఒకటేనా? వేర్వేరా?. ఇంచుమించు రెండు ఒకటే కానీ ఒక ప్రధానమైన తేడా ఉంది. కోరిక అనేది చెడ్డది. లక్ష్యం అనేది మంచిది. సాధారణంగా మనిషికి చాలా రకాల కోరికలు ఉంటాయి మనకున్న కోరికల వల్ల ఇతరులకు, సమాజానికి హాని కలిగితే వాటిని కోరికలు అనవచ్చు. అదేవిధంగా మనకున్న కోరికల వల్ల ఇతరులకు, మనకు, సమాజానికి మంచి జరిగితే అటువంటి కోరికలను లక్ష్యాలు అనవచ్చు .
చెడ్డ కోరికల వాళ్ళ అందరికి చేదు జరుగుతుంది కాబట్టి పురాణాల్లో ఋషులు ఆ విధంగా కోరికలు ఉండకూడదు అని చెప్పారు.

